కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య సమస్యల కారణంగా నేడు రాంచీలో జరిగే ఇండియా కూటమి ర్యాలీకి కూడా హాజరు కాలేదు. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రతినిధి జైరాం రమేష్ పేర్కొన్నారు. రాహుల్ అనారోగ్యానికి గురయ్యారని, దీంతో ఇవాళ రాంచీలో ఇండియా కూటమి నిర్వహిస్తున్న భారీ ర్యాలీలో పాల్గొనలేరని చెప్పారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరవుతారని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. రాంచీలో నిర్వహించే ఇండియా కూటమి ర్యాలీలో భగవంత్ మాన్, లాలూ యాదవ్ సహా పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరుకానున్నారు. రాహుల్ గాంధీ సాత్నాలో ప్రసగించిన తర్వాత.. రాంచీలో ఇండియా బ్లాక్ ర్యాలీకి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే రాహుల్ గాంధీ అకస్మాత్తుగా అస్వస్థకు గురయ్యారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు.
