AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శ్రీరామ శోభాయాత్రకు సర్వం సిద్దం.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్‌లో శ్రీరామ శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. సీతారాంబాగ్‌ నుంచి హనుమాన్‌ వ్యాయామశాల వరకూ వైభవంగా జరిగేలా ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఎన్నికల వేళ కావడంతో శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైదరాబాద్‌ పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. డ్రోన్‌లతో యాత్రను ప్రతిక్షణం పర్యవేక్షించనున్నారు.

నేడు శ్రీరామనవమి సందర్భంగా దేశ వ్యాప్తంగా రామాలయాలు కళకళలాడుతున్నాయి. సీతారాంబాగ్‌ ఆలయం నుంచి హనుమాన్‌ వ్యాయామశాల వరకు శోభాయాత్ర కొనసాగనుంది. సీతారాంబాగ్ టెంపుల్ దగ్గర ప్రారంభమైన శోభాయాత్ర.. బోయిగూడ కమాన్, గంగాబౌళి ఎక్స్ రోడ్, గాంధీ స్టాట్యూ, బేగంబజార్, ఆంధ్రా బ్యాంక్ మీదుగా హనుమాన్ వ్యాయామశాల వరకు జరగనుంది. శోభాయాత్రలో దేవతామూర్తుల భారీ ప్రతిమలు ఆకట్టుకోనున్నాయి. శోభాయాత్రలో 70వేల నుంచి లక్ష వరకూ భక్తులు పాల్గొంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు.

ANN TOP 10