రాష్ట్రంలోనే అత్యధికంగా భద్రాచలం పట్టణంలో 44.7 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నల్గొండ, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్ జిల్లాల్లో అనేక మండలాల్లో 44.5 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి. నేడు, రేపు రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతుందని.. పలు ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.
సర్రుమంటోన్న సూరీడు.. తెలంగాణలో ముదురుతోన్న ఎండలు
ఇక వడదెబ్బ కారణంగా మంగళవారం ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్కు చెందిన చిట్ల రామక్క (78) వడదెబ్బతో మృతి చెందింది. సూర్యాపేట జిల్లా ఫణిగిరికి చెందిన సంగం సుందరయ్య (70) ఖాళీ మద్యం సీసాలు ఏరుకుని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. మధ్యాహ్నం కొడకండ్ల మండలం మొండ్రాయిలో సీసాలు ఏరుకుంటూ వడదెబ్బతో రోడ్డుపైనే కుప్పకూలి స్పాట్లోనే కన్నుమూశాడు.









