ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఈడీ (ED) విచారణ నేపథ్యంలో ఆమె సోదరుడు, మంత్రి కేటీఆర్ (KTR) ఢిల్లీలోనే ఉన్నారు. కవిత ఈడీ విచారణకు సంబంధించి జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తండ్రి, సీఎం కేసీఆర్ (CM KCR)కు అందిస్తున్నారు. కాగా ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, కొత్త ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, వెంకటేష్, నామా నాగేశ్వరరావు, సురేష్ రెడ్డి, బీబీ పాటిల్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర తదితరులు చేరుకున్నారు.