క్రోధినామ నామ సంవత్సర ఉగాది వేడుకలు రవీంద్ర భారతిలో సంప్రదాయకంగా, వైభవంగా జరిగాయి. తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ, రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు ఇందులో పాల్గొని ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో ఒడిదొడుకులను అధిగమించాలని ఉగాది పచ్చడి సూచిస్తుందని పేర్కొన్నారు. వేడుకలకు హాజరైన వారికి సీఎస్ శాంతి కుమారి స్వాగతం పలికారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అన్నారు.
బ్రహ్మశ్రీ శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి క్రోధినామ తెలుగు సంవత్సర పంచాంగ పఠనం చేశారు. శ్రీ క్రోధి నామ సంవత్సరం అంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సమాజంలో మంచి చెడులు ఉంటాయని చెప్పారు. ఆయా అంశాల పట్ల కోపతాపాలకు తావివ్వకుండా సంయమనంతో ప్రశాంతంగా వ్యవహరించాలని అన్నారు.
ఈ వేడుకల్లో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ, సమాచార పౌర సంబంధాల శాఖల స్పెషల్ కమిషనర్ ఎం. హనుమంతరావు, భాషాసాంస్కృతిక శాఖ సంచాలకుడు శ్రీ మామిడి హరికృష్ణ, తదితరులు ఈ పాల్గొన్నారు.