AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

10 వరకు రాధాకిషన్‌రావు విచారణ.. వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును కోర్టు అనుమతితో విచారణ కోసం గురువారం కస్టడీలోకి తీసుకున్నామని వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ చెప్పారు. ఈ నెల 10 వరకు ఆయనను కస్డడీ విచారణకు కోర్టు అనుమతి ఇచ్చిందని తెలిపారు.

అనధికారికంగా ప్రైవేట్‌ వ్యక్తుల ప్రొఫైల్‌ను తయారు చేసి అధికారాలను దుర్వినియోగం చేశారని చెప్పారు. ఒక పార్టీకి లాభం చేకూర్చేలా ఎస్‌ఐబీ కార్యాలయంలో కొందరితో కలిసి కుట్ర చేసి, రికార్డులను ధ్వంసం చేస్తూ, చేసిన నేరానికి సంబంధించిన ఆధారాలు లభించకుండా చేశారని డీసీపీ వివరించారు. ఈ కేసులో మరిన్ని వివరాల సేకరణకు రాధాకిషన్‌రావును బం జారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్నట్టు తెలిపారు.

ANN TOP 10