AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నా ప్రియుడ్ని ఇంట్లోనే పెట్టుకుందాం.. భర్తను కోరిన భార్య.. ఒప్పుకోకపోవడంతో..

ఇది ఏ భార్య చేయకూడని పని! ఎదురింటి యువకుడితో ఎఫైర్‌ పెట్టుకోవడమే కాకుండా.. అతడిని ఇంట్లోనే పెట్టుకోవాలని ఫిక్సయ్యింది. ఈ విషయాన్ని డైరెక్ట్‌గా భర్తకు కూడా చెప్పింది. అంతేకాదు అతడిని ఇంట్లో పెట్టుకుంటే ఖర్చులు కూడా కలిసొస్తాయని ఉచిత సలహా కూడా ఇచ్చింది. భార్య సలహాతో షాకైన భర్త నో చెప్పడంతో.. ఏకంగా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కి నిరసన చేపట్టింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.

గోరఖ్‌పూర్‌ సమీపంలోని పిప్రాయిచ్‌కు చెందిన ఓ 34 ఏండ్ల మహిళకు వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. కానీ ఆమె ఆలోచన పెడదారి పట్టింది. పొరుగింట్లో ఉండే యువకుడిపై మనసుపడింది. అతనితో శారీరక సంబంధం కూడా పెట్టుకుంది. దాదాపు ఏడేండ్లుగా వాళ్ల ఎఫైర్‌ సీక్రెట్‌గా నడుస్తోంది. ఇటీవల ఈ ఎఫైర్‌ సంగతి భర్తకు తెలిసింది. దీంతో ఆమెను నిలదీశాడు. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ కూడా జరిగింది. దీంతో తెగించిన భార్య.. తన ప్రియుడిని తమ ఇంట్లోనే పెట్టుకుందామని భర్తను అడిగేసింది. తన లవర్‌ను ఇంట్లో పెట్టుకోవడం వల్ల తమ ఆర్థిక సమస్యల నుంచి కూడా గట్టెక్కవచ్చని ఉచిత సలహానిచ్చింది.

భార్య సలహా విన్న ఆ భర్తకు దిమ్మతిరిగిపోయింది. అతడిని తమ ఇంట్లో పెట్టుకోవడానికి భర్త ససేమిరా అనేశాడు. దీంతో భార్య అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బాయ్‌ఫ్రెండ్‌ను ఇంట్లోకి అనుమతించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అన్నట్టుగానే ఇంటికి సమీపంలో ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కి నిరసన చేపట్టింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌కు కాల్‌ చేశారు. దీంతో విద్యుత్‌ సరఫరాను నిలపివేశారు. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని బలవంతంగా కిందకు దించాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ANN TOP 10