AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పొలంబాట.. షెడ్యూల్ ఇదే..

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ‘పొలంబాట’లో భాగంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్నారు. ఇటీవల నల్లగొండ, సూర్యాపేట, జనగామ జిల్లాల్లో కేసీఆర్ పర్యటించిన విషయం తెలిసిందే. పొలంబాటలో భాగంగా నీరులేక ఎండిపోయిన పంటలను పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతుల సమస్యలను వింటున్నారు. వారికి తగు సూచనలు ఇస్తున్నారు.

నేడు (శుక్రవారం) కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. రెండు జిల్లాల పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ ఈమేరకు ఖరారైంది. ఉదయం 8.30 గంటలకు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరి 11 గంటలకు కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుమ్ పూర్ గ్రామం చేరుకుంటారు.

ANN TOP 10