AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అప్పట్లో కర్ఫ్యూలు, మతకల్లోలాలే: కిషన్ రెడ్డి

దేశాభివృద్ధి కోసం ఓటు వేయాలని, దీంతో మన భవిష్యత్తు కూడా బాగుపడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం అంబర్ పేట్ నియోజకవర్గం కాచిగూడ డివిజన్‌లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014కు ముందు 50 ఏళ్లు దేశాన్ని కాంగ్రెస్ పరిపాలించిందని, కానీ ఆ తర్వాత మోడీ దేశంలో ఎలాంటి మార్పులు తీసుకోచ్చారో చూడండన్నారు. అవినీతి రహిత పరిపాలన అందించిన మోడీ ప్రభుత్వ లక్ష్యమని కొనియాడారు. దేశ భద్రతను, దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తం చేశారని, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారని తెలిపారు. మే 13వ తేదీన రాష్ట్రంలో లోక్ సభలో ఎన్నికలు జరగనున్నాయని, దేశవ్యాప్తంగా ఎంపీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగుతుందన్నారు. హైదరాబాద్ నగరంలో ఎప్పుడు 40 శాతానికి మించి ఓటింగ్ శాతం నమోదు కాదు అని కిషన్ రెడ్డి అన్నారు. మనం దృష్టి సారించి ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలన్నారు. కాబట్టి అందరూ పోలింగ్‌లో పాల్గొనాలని కోరారు. ఈసారి దేశం, భవిష్యత్తు కోసం ఓటు వేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నానని కిషన్ రెడ్డి అన్నారు.

గతంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థలు మన హైదరాబాద్ నగరంలో ఏ విధంగా బలపడ్డాయో అందరికి తెలిసిందేనన్నారు. లుంబినీ పార్కు, గోకుల్ ఛాట్, దిల్ షుక్ నగర్ లాంటి ప్రదేశాల్లో మన బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. కర్ఫ్యూలు, మతకల్లాలు, బాంబుపేలుళ్లు ఉండేవని, కానీ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి బాంబుదాడులు లేవని పేర్కొన్నారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఐదో ఆర్థిక అతిపెద్ద దేశంగా తీర్చిదిద్దారని తెలిపారు. యూకే లాంటి దేశాలను కూడా వెనక్కి నెట్టేసి ఐదో స్థానంలోకి రావడం అభినందనీయమన్నారు. క్రమశిక్షణతోనే ఆర్థికంగా బలపడ్డామన్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్ చాలావరకూ పెరిగిందన్నారు. ఈ దేశంలో నిరక్షరాస్యత ఉందని కాంగ్రెస్ నాయకులు మాట్లాడారని అన్నారు. రామ జన్మ భూమి, ఆర్టికల్ 370, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇలాంటి అనేక సమస్యలను పరిష్కరించామని కిషన్ రెడ్డి అన్నారు.

ANN TOP 10