AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు పార్టీ పెట్టిండో.. షర్మిల ఎందుకు పోటీ చేస్తుందో..! : సజ్జల

చంద్రబాబు స్వార్థంతో ఏం చేస్తున్నారో అర్థం కావడంలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆ స్వార్థంతోనే వాలంటీర్‌ వ్యవస్థపై చంద్రబాబు కుట్రలు చేశారని మండిపడ్డారు. వాలంటీర్లపై నిమ్మగడ్డ రమేశ్‌తో ఫిర్యాదు చేయించారని పేర్కొన్నారు. వాలంటీర్లను తప్పించాలని లేఖ ఇప్పించింది ఆయనే అని పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్ల వ్యవస్థపై కుట్రతో చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత ఇంకా పెరిగిపోయిందని విమర్శించారు.

పెన్షన్ల విషయంలో తమపై ప్రజాగ్రహం వస్తుందని టీడీపీ గుర్తించిందని.. కానీ చంద్రబాబు ఎంత సంజాయిషీ ఇచ్చినా జనం నమ్మరని సజ్జల విమర్శించారు. గతంలో ఒకటో తేదీన వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో 80 శాతం పెన్షన్‌ పంపిణీ పూర్తయ్యేదని.. కానీ ఇప్పటివరకు 60 శాతం పెన్షన్ల పంపిణీ మాత్రమే జరిగిందని చెప్పారు. పైగా స్వయంగా వెళ్లి తెచ్చుకోవాల్సి రావడంతో వృద్ధులు, దివ్యాంగులు కష్టపడుతున్నారని తెలిపారు. ఈ విషయంలో చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో వాలంటీర్లకు మద్దతుగా మాట్లాడుతున్నారని చెప్పారు. చంద్రబాబుకు సమాజంలో ఉండే అర్హత లేదని విమర్శించారు. ఈసీపై ఒత్తిడి తీసుకొచ్చి పెన్షన్లు అడ్డుకున్నారని తెలిపారు.

ప్రధాని సభ వైఫల్యాన్ని చంద్రబాబు, దగ్గుబాటి పురంధేశ్వరి రాష్ట్ర పోలీసులపై రుద్దే ప్రయత్నం చేశారని సజ్జల అన్నారు. 20 మంది ఎస్పీలపై పురంధేశ్వరి ఫిర్యాదు చేయడం దారుణమని అన్నారు. పవన్‌ పార్టీ ఎందుకు పార్టీ పెట్టారో అర్థం కావడం లేదు.. ఎన్నికల ముందే కూటమి దివాలీ తీసిందని విమర్శించారు. షర్మిల తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టారో తెలియదు.. ఏపీకి వచ్చి ఎందుకు పోటీ చేస్తున్నారో తెలియదు

ANN TOP 10