AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మంత్రి కొండాకు కేటీఆర్‌ లీగల్‌ నోటీసు.. మరో ఇద్దరికి కూడా..

(అమ్మన్యూస్‌, ప్రతినిధి):
ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో చేసిన ఆరోణలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ లీగల్‌ యాక్షన్‌ లోకి దిగారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేత కేకే మహేందర్‌ రెడ్డిపై కేటీఆర్‌ పరువు నష్టం దావా వేశారు. తన ప్రతిష్టకు భంగం కలించేలా ప్రకటనలు చేసినందున క్షమాపణలు చెప్పాలని లేకుంటే లీగల్‌ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పీవీ జనని అండ్‌ అసోసియేషన్‌ పేరుతో ఏప్రిల్‌ 2వ తేదీతో లీగల్‌ నోటీసులు పంపించారు.

నోటీసులకు భయపడే ప్రసక్తేలేదు: మంత్రి కొండా
కాగా తనపై నిరాధారమైన, మతిలేని ఆరోపణలు చేస్తున్నారని ఈ ఆరోపణలపై కోర్టుకు వెళ్తానంటూ నిన్న కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ అంతా ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు. కేటీఆర్‌ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని, తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బదులిచ్చారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే విచారణలో తేలితే తప్పనిసరిగా శిక్షకు అర్హులేనన్నారు.

ANN TOP 10