అమ్మన్యూస్, హైదరాబాద్ :
ఫోన్ ట్యాపింగ్ అంటూ ఆరోపిస్తున్న వారందరికీ లీగల్ నోటీసులు పంపిస్తానని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. నాపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను లీగల్‌గా ఎదుర్కొంటా నన్నారు. కె.కె. మహేందర్ రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు ఇస్తానన్నారు. నిరాధార ఆరోపణలు చేస్తున్న వాళ్లు క్షమాపణ చెప్పాలని, లేకుంటే న్యాయపరమైన పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని కేటీఆర్ ఫైర్ అయ్యారు.









