ఇక ప్రతి వారం బయటకు రావాల్సిందే
సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
అమ్మన్యూస్, హైదరాబాద్ :
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఒక రద్దయిపోయిన వెయ్యి రూపాయల నోటు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. జిల్లాల పర్యటనకు వెళ్తున్న కేసీఆర్ ఇక నుంచి ప్రతి వారం బయటకు రావాలని కోరుకుంటున్నామన్నారు. కేసీఆర్‌కు ఇప్పటికైనా రాష్ట్రంలో రైతులు ఉన్నారన్న విషయం గుర్తుకు వచ్చినందుకు సంతోషమన్నారు. రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతుల వివరాలను కేసీఆర్ ప్రభుత్వానికి ఇవ్వాలని.. ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్‌లా
తాము కమీషన్ల దందా చేయడం లేదని.. రాష్ట్రానికి సంబంధించిన పెండిరగ్ పనుల కోసమే ఢల్లీికి వెళ్తున్నామని క్లారిటీ ఇచ్చారు. తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం రేవంత్ రెడ్డి పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు పలువురు జాతీయ నేతలు హాజరవుతారని, జాతీయ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తారన్నారు. జాతీయ మేనిఫెస్టో ప్రకటనకు తెలంగాణను ఎంచుకున్నందుకు ఏఐసీసీ అధినాయకత్వానికి సీఎం కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షల మంది ఈ సభకు తరలి రావాలని సీఎం పిలుపునిచ్చారు. గతంలో ఆరు గ్యారంటీలను తుక్కుగూడ సభలోనే ఇచ్చామని గుర్తు చేశారు. ఆరు హామీల్లో ఐదింటిని ఇప్పటికే అమలు చేసి చూపించామని చెప్పారు. మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని కొనియాడారు. మహిళా విభాగానికి సంబంధించిన ఏర్పాట్లను సీతక్క, కొండా సురేఖ దగ్గరుండి పర్యవేక్షించాలని ఆదేశించారు.
కేసీఆర్ పదేళ్ల పాలన వందేళ్ల విధ్వంసం
ఈ సందర్భంగా పదేళ్ల కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇప్పటికైనా పొలంబాట పట్టడం సంతోషకరమైన విషయమని అన్నారు. పదేళ్ల తర్వాతనైనా రైతులు, వ్యవసాయం ఆయనకు గుర్తుకు వచ్చినందుకు సంతోషకరమైన విషయం అని ఎద్దేవా చేశారు. అధికారం పోయాక, బిడ్డ జైలుకు వెళ్లాక కేసీఆర్?కు ప్రజలు గుర్తుకు వచ్చారన్నారు. వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు వానాకాలం ఎప్పుడు వచ్చేది తెలియదా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది డిసెంబరులో వానాకాలంలో అధికారంలో ఉన్నది కేసీఆర్ కదా. కేసీఆర్ చేసిన పాపాలకే గతేడాది వానాకాలం వానలు పడలేదు. కేసీఆర్, ఆయన కుటుంబం చేసిన పాపాలకు, నేరాలకు బిడ్డ జైలుకు వెళ్లింది. 2019 ఎన్నికల ముందు మినహా కేసీఆర్ ఏనాడు 10 రోజుల్లో రైతుబంధు పూర్తి చేయలేదు. ప్రతి సీజన్? రైతుబంధును పూర్తి చేసేందుకు నాలుగైదు నెలలు తీసుకున్నారు.









