అమరావతి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న మొదటి జాబితా అభ్యర్థులను ఏపీ కాంగ్రెస్ అధిష్ఠానం విడుదల చేసింది. 114 అసెంబ్లీ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇక 5 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను వెల్లడించింది. కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల రెడ్డి పోటీ చేయనున్నారు. కాకినాడ నుంచి పల్లంరాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్దరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కర్నూల్ నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ పోటీ చేయనున్నారు.















