తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు బీఆర్ఎస్ నేతలు కలిశారు. శుక్రవారం సీఎం నివాసంలో బీఆర్ఎస్ నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి కలిశారు. వీరు మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిశారు. ఇటీవల పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇలాంటి సమయంలో ముఖ్య నేతలు… ముఖ్యమంత్రితో కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ముఖ్యమంత్రిని కలిసిన లోక్ సభ అభ్యర్థులు
సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థులు ఆయన నివాసంలో కలిశారు. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి సీఎంతో పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీని కలిశారు. ఆదిలాబాద్ అభ్యర్థి ఆత్రం సుగుణ, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మర్యాదపూర్వకంగా కలిశారు.