AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది.. ఫైనల్ మ్యాచ్ ఎక్కడంటే!

ఐపీఎల్ 17వ సీజ‌న్ అట్టహాసంగా ప్రారంభమైంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల నేపథ్యంతో ఈసారి మొత్తం 74 మ్యాచ్‌ల‌ను భార‌త్‌లోనే నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. ఏప్రిల్ 7వ తేదీన మొద‌టి విడ‌త మ్యాచ్‌లు ముగిసిన తెల్లారే రెండో విడ‌త ప్రారంభం కానుంది. టోర్నీ ఆరంభానికి ముందు తొలి విడ‌త షెడ్యూల్ విడుద‌ల చేసిన బీసీసీఐ.. తాజాగా పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. ఏప్రిల్ 8వ తేదీన చెన్నై సూప‌ర్ కింగ్స్, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

అయితే లోక్‌సభ ఎన్నికల కారణంగా ఐపీఎల్ సెకండ్ పార్ట్‌ను విదేశాల్లో నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. ఈ తరుణంలో ఆ వ్యవహారంపై చర్చించి స్వదేశంలోనే నిర్వహించేందుకు బీసీసీఐ మొగ్గు చూపింది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లను అహ్మదాబాద్‌లో, ఫైనల్ మ్యాచ్‌ను చెన్నైలో నిర్వహించనున్నారు. కాగా మే 21న క్వాలిఫైయర్ 1, మే 22న ఎలిమినేటర్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మే 24న జరిగే క్వాలిఫైయర్-2 తోపాటు మే 26న జరిగే ఫైనల్ మ్యాచ్‌లకు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక కానుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10