AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇష్టంగా చదివితే ఏదైనా సాధ్యమే.. కంది శ్రీనివాస రెడ్డి

ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస రెడ్డి
ధర్మ విద్యాలయంలో ధన్యవాద్‌ దివస్‌

(అమ్మన్యూస్‌ ప్రతినిధి, ఆదిలాబాద్‌):
మనసు పెట్టి చదివితే అనుకున్నది సాధించవచ్చని ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని పోలీస్‌ కాలనీలో గల ధర్మ విద్యాలయంలో నిర్వహించిన ధన్యవాద్‌ దివస్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్కూల్‌ విద్యార్థులు, యాజమాన్యం, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఆరంభించారు. ఆయనతో పాటు డీసీసీబీ చైర్మన్‌ అడ్డి భోజారెడ్డి వేదికను పంచుకున్నారు.


స్కూల్‌ నిర్వాహకుల ఆశయాలకనుగుణంగా సిబ్బంది విద్యార్థులు నడుచుకోవాలని కంది శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. మన ఆలోచనలను ఇతరులతో పంచుకున్నప్పుడే కార్యాచరణ సిద్ధిస్తుందని, తద్వారా సక్సెస్‌ వరిస్తుందన్నారు. తలచుకుంటే బాగా చదివి రాణించవచ్చని అలా రాణించాలంటే సమయ పాలన ముఖ్యమన్నారు. ఆ సమయ పాలనే తనను ఉన్నతంగా నిలబెట్టిందని కంది శ్రీనివాస రెడ్డి చెప్పారు. మనసు పెట్టి ప్రయత్నిస్తే అనుకున్నది సాధించవచ్చన్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు ఆశయం కాకుండా పారిశ్రామిక వేత్తలు కూడా కావాలని లక్ష్యంగా పెట్టకోవాలని సూచించారు. ఉద్యోగాలు చేయడం కాదు ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో తుమ్మల వెంకట్‌ రెడ్డి, బాయిన్‌ వార్‌ గంగా రెడ్డి, సురేందర్‌ రెడ్డి, ఖయ్యుమ్‌ పలువురు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ANN TOP 10