ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్(Allu Arjun) ఖైరతాబాద్(Khairatabad) ఆర్టీఓ కార్యాలయంలో బుధవారం ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్( International driving license) పొందారు. హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సి. రమేష్, ఆర్టీఓ పురుషోత్తమ్ ఆధ్వర్యంలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియ పూర్తి చేశారు. అనంతరం అల్లు అర్జున్‌తో సిబ్బంది సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.









