AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్? బీజేపీలోకి నామా నాగేశ్వరరావు?

తెలంగాణలోని రెండు లోక్ స్థానాలను పెండింగ్ లో పెట్టింది బీజేపీ. వరంగల్, ఖమ్మం స్థానాలను పెండింగ్ లో ఉంచారు. వరంగల్ టికెట్ ఆరూరి రమేశ్ కు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక ఖమ్మం స్థానంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు కమలనాథులు. తెలంగాణ బీజేపీ నేతలు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 22న బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు.

పొత్తులో భాగంగా ఖమ్మం స్థానం టీడీపీకి కేటాయిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఖమ్మం సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. పార్టీ మార్పు అంశాన్ని ఎంపీ నామా ఇంతవరకు ఖండించలేదు. ఇంకోవైపు ఖమ్మం టికెట్ ఆశించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు.

ఈ నెల 22న బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. దీనికి బీజేపీ రాష్ట్ర నేతలు హాజరుకానున్నారు. పెండింగ్ లో ఉన్న రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసుకుని వచ్చే విధంగా ప్లాన్ చేశారు. 17 లోక్ సభ స్థానాలకుగాను 15 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. రెండు స్థానాల్లో (వరంగల్, ఖమ్మం) అభ్యర్థులను పెండింగ్ లో ఉంచింది. వరంగల్ టికెట్.. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆరూరి రమేశ్ కు దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. ఖమ్మం స్థానంపైనే కొంత ఎటూ తేల్చుకోలేకపోతున్నారు కమలనాథులు.

పొత్తులో భాగంగా ఈ సీటుని టీడీపీకి కేటాయిస్తారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఇక్కడ టీడీపీ పోటీ చేసేందుకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సహా ఇతర బీజేపీ సీనియర్ నేతలు.. టీడీపీ తెలంగాణలో పోటీ చేయాల్సిన అవసరం లేదని, పూర్తిగా తెలంగాణలో మేమే పోటీ చేస్తాం అన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకోవైపు ఖమ్మం ఎంపీ టికెట్ ఆశిస్తూ బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు.

ANN TOP 10