విద్యార్థులపై ఊడిపడిన పాఠశాల పైకప్పు
పలువురికి తీవ్ర గాయాలు
(అమ్మన్యూస్ ప్రతినిధి, ఆదిలాబాద్):
ఆదిలాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. టెన్త్ విద్యార్థులు పరీక్ష రాస్తుండగా పాఠశాల పై కప్పు ఒక్క సారిగా ఊడి పడిరది. మంగళవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. జైనథ్ మండల పరిధిలోని గిమ్మ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలోనే ఇవాళ విద్యార్థులు పరీక్ష రాస్తుండగా ఉన్నట్టుండి తరగతి గది పైకప్పు ఒక్కసారిగా ఊడిపడిరది. ఈ ప్రమాదంలో పరీక్ష రాస్తున్న విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్ కూడా తీవ్ర గాయలయ్యాయి. గమనించిన తోటి సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.