హైదరాబాద్: తమిళిసై సౌందరరాజన్ ఇవాళ తెలంగాణ గవర్నర్ (Telangana Governor) పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి పంపించారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తమిళిసై బీజేపీ తరుఫున చెన్నై సెంట్రల్ (Chennai Central) లేదా తుత్తుకూడి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారని తెలుస్తోంది. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి సైతం తమిళిసై రాజీనామా చేశారు. గవర్నర్ పదవి చేపట్టడానికి ముందు తమిళనాడు బీజేపీ చీఫ్‌గా వ్యవహరించిన ఆమె ఇప్పుడు అదే రాష్ట్రం నుంచి లోక్‌సభ బరిలోకి దిగనున్నారట.









