కాంగ్రెస్ లో చేరిన బీఆర్ ఎస్ తాజా మాజీ సర్పంచ్ ప్రమీలా రాజేశ్వర్
పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న గ్రామస్తులు
అమ్మన్యస్ ప్రతినిధి ఆదిలాబాద్ : ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయం,ప్రజా సేవ భవన్ నిత్యం అభిమానులు , నాయకులు , కార్యకర్తలతో సందడిగా మారుతోంది. ఆదిలాబాద్ పట్టణంలోని వార్డ్ నెంబర్ 10 రాంనగర్ కాలనీకి చెందిన మాజీ ఎంపీటీసీ జి.సాంబాజీ,బీ.సి నాయకులు ఏ. భాస్కర్ లతో పాటు పలువురు కాలనీ వాసులు కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారందరికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలతో పాటు స్థానిక సంస్టల ఎన్నికలలోనూ కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల గెలుపుకు కృషి చేయాలని కంది శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఎన్నోసంక్షేమ పథకాలు దరి చేరాయని గ్యారెంటీ హామీలతో ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని ఆయన అన్నారు. అందుకే అన్ని పార్టీలు కాంగ్రెస్ వైపే చూస్తున్నాయన్నారు. పార్టీలోకి భారీ ఎత్తున చేరికలు జరుగుతున్నాయని మరో ఇరవై ఏళ్లవరకు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని అన్నారు. పార్టీలో చేరిన కాలనీ వాసులలో కె.తుకారాం, ఏ.హన్మాండ్లు, ఏ.రవీందర్, ఆర్ .వెంకటి, ఏ. లింగారెడ్డి , యం. విటోభా, కె.హన్మాండ్లు , కె. రఘు,బీ. శివదాస్, పి. కిషన్ , జాఫర్ తదితరలున్నారు. ఈ కార్యక్రమం లో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.









