AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ముళ్ల పొదల్లో ప‌సికందు.. ఆదిలాబాద్ జిల్లాలో అమానుష ఘ‌ట‌న‌

ఆదిలాబాద్ : జిల్లాలో గురువారం ఉదయం ఓ అమానుష ఘ‌ట‌న చోటు చేసుకుంది. మానవ‌త్వాన్ని మంట గ‌లిపేలా రోజులు కూడా నిండ‌ని ఓ ప‌సికందును భీంపూర్ మండ‌లం నిపాని గ్రామ శివారులోని ముళ్ల పొద‌ల్లో ప‌డేసారు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు. ఎవ‌రు.. ఎందుకిలా చేసార‌న్న‌ది తెలియ లేదు. ఉద‌యాన్నే అటుగా వెళ్తున్న స్థానికుల‌కు పొదల్లోంచి ఏడుపు వినిపించ‌డంతో ప‌సికందును బ‌య‌ట‌కు తీసారు. పేగు తెంచుకు పుట్టిన ప‌సికందును వ‌దులుకోవ‌డానికి ఆ క‌న్న‌త‌ల్లికి మ‌న‌సెలా ఒప్పిందోన‌ని అంటూ పోలీసుల‌కు స‌మాచార‌మిచ్చి ఆ మ‌గ శిశువుకు స్నానం చేయించారు స్థానికులు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ,ఐసీడీఎస్ అధికారులు శిశువును 108 ఆంబులెన్స్ లో జిల్లాకేంద్రంలోని శిశు గృహానికి త‌ర‌లించారు.

ANN TOP 10