AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాసేపట్లో అటవీ పర్యావరణశాఖపై సీఎం రేవంత్ సమీక్ష

అటవీ పర్యావరణ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరికాసేపట్లో సమీక్ష చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం, పోడు భూముల సమస్యలు, పర్యావరణం తదితర అంశాలపై చర్చించనున్నారు. సాయంత్రం 317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరుగనుంది. ఉద్యోగుల బదిలీలు, స్థానికతపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. గడిచిన ఆదివారం ఎంసీఎచ్‌ఆర్‌డీలో ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి భేటీ అయిన విషయం తెలిసిందే. ఈరోజు మరోసారి సమావేశంకానున్నారు. సమావేశం అనంతరం ప్రభుత్వనికి ఉద్యోగ సంఘాలు తమ నిర్ణయాన్ని తెలపనున్నారు.

ANN TOP 10