ఎట్టకేలకు మరో టాలీవుడ్ నటుడు పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న రూమర్స్‌కు చెక్ పెడుతూ కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), నటి రహస్య ఘోరక్ ఓ ఇంటి వారు కాబోతున్నారు. 2019లో ‘రాజావారు రాణిగారు’ (Raja Vaaru Rani Gaaru) సినిమాతో తెలుగులో నటుడిగా ఆరంగేట్రం చేసిన కిరణ్ ఇప్పుడు అదే సినిమాలో కథానాయికగా చేసిన రహస్య (Rahasya Ghorak) తో ఈ రోజు (బుధవారం) సాయంత్రం పెద్దల సమక్షంలో ఎంగెజ్మెంట్ చేసుకున్నారు.
అయితే వీరిద్దరి రిలేషన్ గురించి ఆ సినిమా విడుదలైన తర్వాత నుంచే నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇన్నాళ్లు ఇయన వాటిపై స్పందించలేదు. తాజాగా ఎంటేజ్మెంట్‌తో పాత వార్తలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టినట్లైంది.