AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నాలుగు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌

వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరో నాలుగు లోక్‌సభ స్థానాలకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఖరారు చేశారు. వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్‌ కడియం కావ్యను, చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ పేర్లను ప్రకటించారు. జహీరాబాద్‌ పార్లమెంటు స్థానానికి గాలి అనిల్‌కుమార్‌, నిజామాబాద్‌ పార్లమెంటు స్థానానికి బాజిరెడ్డి గోవర్దన్‌ను నిర్ణయించారు. బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో చర్చించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా కేసీఆర్‌ అభ్యర్థులను ఎంపిక చేశారు.

కాగా ఇప్పటికే బీఆర్‌ఎస్‌ పార్టీ ఐదు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ, బీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, మహబూబాబాద్‌ (ఎస్టీ రిజర్వ్‌) స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ మాలోత్‌ కవిత, కరీంనగర్‌ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, పెద్దపల్లి (ఎస్సీ రిజర్వ్‌) స్థానం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను తొలి జాబితాలో ఖరారు చేశారు. అనంతరం మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థిగా మన్నెం శ్రీనివాస్‌రెడ్డిని ప్రకటించారు.

ANN TOP 10