AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఫ్రీ హలీం ఆఫర్.. పోటెత్తిన జనం.. ట్రాఫిక్ జామ్..

ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాస ఉపవాస దీక్షలు ప్రారంభం అయ్యాయి. వచ్చేనెల నెలవంక కనిపించే వరకూ ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష పాటిస్తారు. ఆ సమయంలో వారి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు హలీం తింటారు. పౌష్టిక విలువలతో కూడిన హలీమ్ ఇతరులు కూడా భోంచేస్తారు.

దీని ఆసరాగా మలక్ పేట పరిధిలో ఒక హోటల్ యాజమాన్యం మంగళవారం ఫ్రీ హలీం అంటే వందలాది మంది దూసుకు వచ్చారు. ఫలితంగా హోటల్ వద్ద జనం రద్దీతో గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో హోటల్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. ఈ సందర్భంగా మలక్ పేట పరిధిలోని ఆ హోటల్ వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యింది.

ANN TOP 10