ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానుడంగా ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తుంది. అందులో భాగంగానే మొన్న దేశ వ్యాప్తంగా 36 మందితో తొలి జాబితాను ప్రకటించింది. తెలంగాణకు నలుగురు అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే రేపు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుండగా.. రాష్ట్రంలో మరో ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. చేవెళ్ల, సికింద్రాబాద్, మెదక్, నిజామాబాద్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది.
