AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్

కాంగ్రెస్ నుంచి లోక్‌స‌భ ఎన్నికల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల తొలి జాబితాను ఆ పార్టీ ప్ర‌క‌టించింది. ఈ మేరకు శుక్రవారం దేశవ్యాప్తంగా 36 మందితో కూడిన జాబితాను విడుదల చేశారు. తెలంగాణ‌లో మొత్తం 17 పార్ల‌మెంట్ స్థానాల‌కు గానూ తొలి జాబితాలో కేవ‌లం నాలుగు స్థానాల‌కు అభ్యర్థులను హైకమాండ్ ఖరారు చేసింది. అయితే గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీపీపీ నేత సోనియాగాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ల నేతృత్వంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీ స్థానం నుంచి చ‌ల్లా వంశీచంద్ రెడ్డి పోటీ చేస్తార‌ని సీఎం రేవంత్ రెడ్డి ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. కానీ ఈ స్థానాన్ని ప్ర‌క‌టించ‌కుండా కాంగ్రెస్ అధిష్టానం హోల్డ్‌లో ఉంచింది.

జ‌హీరాబాద్ – సురేష్ షెట్కార్
న‌ల్ల‌గొండ – కుందూరు ర‌ఘువీర్
మ‌హ‌బూబాబాద్ – బ‌ల‌రాం నాయ‌క్
చేవెళ్ల – సునీత మ‌హేంద‌ర్ రెడ్డి

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10