AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పండుగపూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు దుర్మరణం

నిజామాబాద్ : పండుగు పూట విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన వేల్పూర్ మండలం పడగల్ గ్రామ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకారం మోర్తాడ్ మండలం దొనకల్ గ్రామానికి చెందిన మారవీటి రవీందర్ (55) మారవీటి శివరాజ్ (24) బైక్‌పై ఆర్మూర్ వైపు వెళ్తున్నారు. కాగా, పడగల్ గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వారు అక్కడికక్కడే మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న రవీందర్‌ను కొడుకు శివరాజ్‌ హాస్పిటల్ తీసుకెళ్తుండగా తండ్రి, కొడుకులు మృతి చెందినట్లు ఎస్సై వినయ్ తెలిపారు. తండ్రి, కొడుకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.

ANN TOP 10