AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీ నేతలను కలిసిన మాధవీలత

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి మాధవీలత సైదాబాద్‌లో పార్టీ ముఖ్యనేతలను కలిశారు. అండగా నిలిచి పార్టీ విజయానికి సహకరించాలని ఆమె కోరారు. భాగ్యనగర్‌ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్‌రెడ్డి, కార్పొరేటర్‌ కొత్తకాపు అరుణారవీందర్‌రెడ్డి, నగర మాజీ డిప్యూటీ మేయర్‌ సుభాష్‌చందర్జీలను నివాసాలకు వెళ్లి కలిశారు. డివిజన్‌ ముఖ్య నేతలను పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాధవీలతను సత్కరించారు.

మాధవీలతను కలిసిన కార్పొరేటర్‌
చాదర్‌ఘాట్‌: హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మాధవిలత(Madhavilatha)ను కార్పొరేటర్‌ బొక్క భాగ్యలక్ష్మీరెడ్డి, బీజేపీ భాగ్యనగర్‌ జిల్లా అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్‌రెడ్డితో కూడిన బృందం శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ మాట్లాడుతూ మోదీ గ్యారెంటీ పథకాలతో ప్రజల్లోకి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించి మాధవిలత విజయం కోసం తమ వంతు కృషి చేస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షుడు కొప్పుల దినేష్‌, నాయకులు తుమ్మలపల్లి రమే్‌షరెడ్డి, బొక్క మధుసూదన్‌రెడ్డి, మందడి సందీ్‌పరెడ్డి పాల్గొన్నారు.

ANN TOP 10