పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని తెలంగాణలోని అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ బలాబలాలపై కొన్ని సంస్థలు ప్రీ పోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ట్రాకర్ అనే పోల్ సంస్థ వెల్లడించిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెలుగుచూశాయి.
Samples taken from 12 LS seats so far.
Overall vote share : Congress – 46%, BJP -30%, BRS -22%
ట్రాకర్ పోల్ సర్వే వెల్లడించిన ఫలితాల్లో ఆసక్తిక విషయాలు వెలుగుచూశాయి. ఆ సంస్థ మెుత్తం 17 ఎంపీ స్థానాలకు గానూ 12 స్థానాల్లో సర్వే నిర్వహించగా.. కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మెుగ్గు చూపారు. మెుత్తం ఓట్ల శాతంలో కాంగ్రెస్ పార్టీకి 46 శాతం ఓటర్లు మద్దతు తెలుపగా.. అనుహ్యంగా బీజేపీ రెండో స్థానంలో నిలించింది. ఆ పార్టీకి 30 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాడో స్థానానికి పరిమితమైంది. గతంలో 9 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీకి ఈసారి 22 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని సర్వేలో తేలింది.
మహిళలు, పురుషుల వారీగా ఓట్ల శాతంలోనూ కాంగ్రెస్ వైపే మెుగ్గు ఎక్కువగా ఉంది. మెుత్తం పురుష ఓటర్లలో కాంగ్రెస్ పార్టీకి 42 శాతం మంది, బీజేపీకి 34 శాతం మంది, బీఆర్ఎస్ పార్టీకి 21 శాతం మంది మద్దతు ప్రకటించారు. మహిళా ఓటర్లలో కాంగ్రెస్ పార్టీకి 50 శాతం ఓటర్లు, బీజేపీకి 26 శాతం, బీఆర్ఎస్ పార్టీకి 23 శాతం ఓటర్లు మెుగ్గు చూపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, రూ. 500 గ్యాస్ సిలండర్ పథకాల అమలుతో పురుషుల కంటే 8 శాతం అధికంగా మహిళలకు కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు.









