ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న ఎలాన్ మస్క్(Elon Musk) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మస్క్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్‌పై నలుగురు వ్యక్తులు కోర్టులో 128 మిలియన్ డాలర్లకుపైగా(రూ.1061,28,96,000) చెల్లించాలని దావా(lawsuit) వేశారు. అయితే ఈ నలుగురు వ్యక్తులు ట్విట్టర్ నుంచి వారిని తొలగించిన తర్వాత తమకు ఇవ్వాల్సిన పరిహారం పూర్తిగా ఇవ్వలేదని ఆరోపించారు.
ఈ క్రమంలో కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టు(federal court)లో ఈ కేసు నమోదు చేశారు. పరాగ్ అగర్వాల్(Parag Agrawal)తో పాటు మస్క్‌పై కేసు నమోదు చేసిన ముగ్గురు వ్యక్తులు మాజీ ట్విటర్ CFO నెడ్ సెగల్, మాజీ చీఫ్ లీగల్ ఆఫీసర్ విజయ్ గద్దె జనరల్ కౌన్సెల్ షాన్ అగేట్. పిటిషనర్ల తరపున దాఖలు చేసిన కేసులో మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన వెంటనే సరైన కారణం లేకుండా ఆ వ్యక్తులను కంపెనీ నుంచి తొలగించారని పేర్కొన్నారు.
కంపెనీ తమకు నష్టపరిహారం చెల్లించకుండా ఉండేందుకు కల్పిత కారణాలు చెప్పారని వారు అన్నారు. మస్క్ డబ్బును ఉపయోగించి తన నుంచి భిన్నంగా ఆలోచించే వారిని పక్కన పెట్టాడని వారు ఆరోపించారు. ఈ క్రమంలో ఆయా వ్యక్తులు మస్క్ నుంచి 128 మిలియన్ డాలర్లు(USD 128 million) లేదా రూ. 1061 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్(demand) చేశారు.
ఇక ఎలోన్ మస్క్ 2022లో 44 బిలియన్ డాలర్లు చెల్లించి ట్విట్టర్‌ని కొనుగోలు చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఆ సమయంలో కంపెనీ సీఈవోగా(Former Twitter CEO) పరాగ్ అగర్వాల్ అన్నారు. ఆ తర్వాత సీఈఓ సహా అనేక మంది ఉద్యోగులను మస్క్ తొలగించారు.









