AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రామోజీ రావును కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదిలాబాద్ ​పర్యటనలో పాల్గొన్న అనంతరం నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ చేరుకున్నారు. రామోజీ గ్రూప్ కార్పొరేట్​కార్యాలయంలో రామోజీరావును కలిశారు. సీఎం రేవంత్ రెడ్డికి రామోజీరావు బొకే ఇచ్చి సాదర స్వాగతం పలికారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్న తీరు, ప్రజాపాలన విధానాలపై చర్చించారు. రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయాలు కూడా భేటీలో చర్చకు వచ్చాయి.

ఈ సమావేశంలో ఈనాడు ఎండీ కిరణ్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. కాగా, సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి.. తొలిసారి రామోజీరావును కలవడం గమనార్హం. గతంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి కీలక నేతగా ఉన్న విషయం తెలిసిందే. నాటి నుంచే రామోజీరావుతో రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలున్నాయి. ఈ క్రమంలోనే తాజా భేటీ జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ANN TOP 10