AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సమస్యలు శీనన్న దృష్టికి తీసుకెళ్తా.. పలువురికి ప్రసాద్ రెడ్డి పరామర్శ

అమ్మన్యూస్, నేలకొండపల్లి: కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి నేలకొండపల్లి మండలం నుంచి శనివారం ఉభయ జిల్లాల పర్యటన ప్రారంభించారు. తొలుత ముజ్జుగూడెం గ్రామంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రేగుల చిన్న పుల్లయ్య భార్యను పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం రాష్ట్ర మంత్రి పొంగులేటి శీనన్న దృష్టికి తీసుకెళ్తానని, ధైర్యంగా ఉండాలని అభయం ఇచ్చారు. ఇదే గ్రామంలో షేక్ కన్నాం సాబ్, జాన్ బీలను, మరో ఇంట వికలాంగ చిన్నారిని పరామర్శించారు. అనంతరం అనాసాగరంలో సళ్ళంగుండ సావిత్రమ్మ, గూనగుంట్ల వెంకయ్య, అనంత రామయ్య ల ఇళ్లకు వెళ్లి వారిని ఓదార్చారు. ఆ తర్వాత సదాశివ పురంలో అనారోగ్యంతో బాధ పడుతున్న ఎండ్రాతి ప్రమీల, వీఆర్ఏ నోచిన రోశయ్య లను పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ వజ్జా రమ్య, కాంగ్రెస్ నాయకులు నెల్లూరి భద్రయ్య, కొడాలి గోవిందరావు, శాఖమూరి రమేష్, వెన్నపూసల సీతారాములు, గూడవల్లి రాంబ్రహ్మం, కుక్కల హనుమంతరావు, మహిషా శంకర్, మట్టా దుర్గారెడ్డి, ఎడవల్లి సైదులు, జర్రిపోతుల అంజని, బచ్చలిపుర నాగరాజు, మరికంటి వి రాణి, రమేష్, కొత్త కోళ్ల సుధాకర్, బోయిన వేణు తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10