మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారులు షాకిచ్చారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్‌ఎండీఏ లే అవుట్‌లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలిగించారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్‌ఎండీఏ (HMDA) లే అవుట్‌లో 2500 గజాల భూమిని మల్లారెడ్డి ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేశారు. కాలేజీ కోసం మాజీ మంత్రి రోడ్డును వేసుకున్నారు.
అయితే ఈ వ్యహారంపై గతంలో ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి .. అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూమి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో ఈరోజు (శనివారం) హెచ్‌ఎండీఏ లే అవుట్‌లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించేశారు.









