కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రమాదం తప్పింది. చలో మేడిగడ్డ కు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బస్సు టైర్ ఒక్కసారిగా బ్లాస్ అయ్యింది. దీంతో మార్గమధ్యలోనే బస్సు ఆగిపోయింది. బస్సు టైర్ బ్లాస్ట్ కావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భయాందోళనకు గురయ్యారు. బస్సులో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు ఉన్నారు. ఈ ఘటన జనగాం దగ్గర చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న మిగిలిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సహాయక చర్యలు చేపడుతున్నారు. వెంటనే మెకానిక్‌ను పిలిపించిన నేతలు దగ్గరుండి టైర్ మార్పిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఎమ్మెల్యేలు ఊపిరి పీల్చుకున్నారు.