హైదరాబాద్: పార్టీని కాపాడుకోలేని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)… సీఎం రేవంత్ రెడ్డిపై ఛాలెంజ్ చేయడం చూస్తుంటే నవ్వొస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పవర్ ఏమిటో చూశాక కూడా కేటీఆర్ ఇలాంటి ఛాలెంజ్‌లు చేయడం మానుకోవాలన్నారు.
కేటీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు అయినా గెలవడానికి ప్రయత్నాలు చేసుకుంటే మంచిదన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కేటీఆర్‌కి సిగ్గు రాలేదన్నారు. ఇప్పటికే ఒక ఎంపీ, ఒక జడ్పీ చైర్మన్ నిన్ననే పార్టీ మారారన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ తన పార్టీ గురించి ఆలోచించుకుంటే మంచిదని మల్లు రవి హితవు పలికారు.