బాధ్యత మరచి ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Leader KTR) విమర్శలు గుప్పించారు. మేడిగడ్డకు బయలుదేరే ముందు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వాస్తవాలు చెప్పడానికే మా ఈ చలో మెడిగడ్డ’’ పర్యటన అని స్పష్టం చేశారు. రైతు ప్రయోజనం ముఖ్యం కాదని… రాజకీయ ప్రయోజనం కాంగ్రెస్ పార్టీకి కావాలన్నారు. ఈరోజు చేస్తున్నది మొదటి పర్యటన మాత్రమే అని.. తర్వాత అన్ని ప్రాజెక్టులు పర్యటిస్తామన్నారు. రిపేర్ చేయడానికి ఇబ్బంది ఏంటని.. భాద్యులపై చర్యలు తీసుకోవాలని.. రైతులను బలి చేయొద్దని కోరారు. రిపేర్ చేయకుండా ఉంటే వర్ష కాలంలో వరద వస్తే బరేజ్ కొట్టుకపోవాలి చూస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు.