పవన్ కల్యాణ్ చిత్రం గబ్బర్ సింగ్ లోని ‘గన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల’ గీతాన్ని ఆలపించిన ప్రముఖ గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. నేడు పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ లోని పద్మారావు నగర్ లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
వడ్డేపల్లి శ్రీనివాస్ హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది కొన్ని రోజుల కిందటే డిశ్చార్జి అయ్యారు. వడ్డేపల్లి శ్రీనివాస్ సినీ గాయకుడిగా కంటే జానపద గాయకుడిగా ఎంతో గుర్తింపు పొందారు. 100కి పైగా ప్రైవేట్ సాంగ్స్ తో అలరించారు. గబ్బర్ సింగ్ చిత్రంలోని పాటకు ఆయన ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు.