AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దమ్ముంటే నామీద గెలువు చూద్దాం: బల్మూరి వెంకట్

అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఘాటు విమర్శలతో పాటు సవాళ్లు ప్రతిసవాళ్లతో హీటెక్కిపోతోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య నడుస్తోన్న ఛాలెంజ్‌లు రంజుగా మారాయి. అయితే.. రేవంత్ రెడ్డి సవాలుకు స్పందిస్తూ కేటీఆర్ విసిరిన ఛాలెంజ్‌కు.. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి వరకు ఎందుకు.. తనపై గెలిచి చూపించాలంటూ కేటీఆర్‌కు సవాల్ విసిరారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య సవాళ్ల పర్వం నడుస్తున్న విషయం తెలిసిందే. దమ్ముంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిపించి చూపించు అని కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసరగా.. దానిపై ఈరోజు కేటీఆర్ స్పందించారు. అయితే.. తాను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రేవంత్ కూడా కొడంగల్ ఎమ్మెల్యేతో పాటు సీఎంగా రాజీనామా చేసి.. తన సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ తేల్చుకుందామంటూ కేటీఆర్ ప్రతిసవాల్ విసిరారు. అయితే.. కేటీఆర్ చేసిన ఛాలెంజ్ మీద ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పందించారు.

కేటీఆర్ చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు బల్మూరి వెంకట్ ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరే స్థాయి కేటీఆర్‌కు లేదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వరకు ఎందుకు.. మల్కాజిగిరి బరిలో తానే దిగుతానని.. దమ్ముంటే కేటీఆర్ తనపై పోటీ చేసి గెలవాలంటూ వెంకట్ ఛాలెంజ్ చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు తాను సిద్ధమని.. కేటీఆర్ రెడీనా అని అడిగారు. కేవలం మల్కాజిగిరినే కాదు.. కేటీఆర్ కోరుకున్న ఏ పార్లమెంట్ స్థానం నుంచైనా తాను పోటీకి సిద్ధమంటూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రకటించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10