AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎంను కలిసిన ప్రెస్ అకాడమీ చైర్మన్

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా కే శ్రీనివాస్‌రెడ్డి నియమకం అయిన విషయం తెలిసిందే. ఈ నెల 25న మీడియా అకాడమీ చైర్మన్‌గా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా అకాడమీ చైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డి నియమితులైన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. బుధవారం సచివాలయంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక జీవో వెలువడిన తేదీ నుంచి రెండేళ్లపాటు శ్రీనివాస్ రెడ్డి ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో ఆయన విశాలాంధ్ర పత్రిక సంపాదకులుగా పని చేయగా.. ప్రస్తుతం ప్రజాపక్షం పత్రికకు ఆయన ఎడిటర్‌గా ఉన్నారు.

ANN TOP 10