తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ (BRS) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు బండ్రు శోభా రాణి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుతో కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయి మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ నేతలందరూ ఆసుపత్రిలో చూపించుకోవాలని దుయ్యబట్టారు. లంకె బిందెల్లాంటి రాష్ట్రాన్ని దివాళా తీసేలా చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో రాష్ట్ర ఖజానాని హరీష్ రావు ఖాళీ చేశారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలకి విముక్తి లభించిందని పేర్కొన్నారు. కేటీఆర్ క్షమాపణ చెప్పకపోతే క్రిమినల్ కేసు పెడతామని ఆమె హెచ్చరించారు.