AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్న నేతలు.. తాజాగా హైదరాబాద్ డిప్యూటీ మేయర్…

గ్రేటర్‌ హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో భారీ షాక్‌ తగిలింది. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తార్నాక డివిజన్‌ కార్పొరేటర్‌, డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలత శోభన్‌ రెడ్డి దంపతులు సీఎం రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ సమక్షంలో ఫిబ్రవరి 25న ఆదివారం కాంగ్రెస్‌ లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని డిప్యూటీ మేయర్‌ కార్యాలయ సభ్యులు వెల్లడిరచారు. కాగా కొద్దీ రోజులుగా బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్న డిఫ్యూటీ మేయర్‌ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు రాజీనామా లేఖను పార్టీ అధినేతకు పంపించారు. డిప్యూటీ మేయర్‌ శ్రీలతతో పాటు మరో ఆరుగురు బీఅర్‌ఎస్‌ కార్పొరేటర్లు కాంగ్రెస్‌ లో చేరనున్నట్లు తెలుస్తోంది.

ఇక మాజీ హైదరాబాద్‌ మేయర్‌, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి సైతం కాంగ్రెస్‌ పార్టీ చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయన కోడలు రంగారెడ్డి జడ్పీ చైర్‌ పర్సన్‌ తీగల అనితా రెడ్డితో కలసి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసుకున్నారు. త్వరలో వీరిద్దరూ బీఆర్‌ఎస్‌ పార్టీ వీడి కాంగ్రెస్‌ చేరనున్నట్లు తెలుస్తోంది. వీరితో మాజీ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి సైతం సీఎం రేవంత్‌ను కలిశారు. ఇక ఇప్పటికే పట్నం మహేందర్‌ రెడ్డి సతీమణి వికారాబాద్‌ జెడ్పీ ఛైర్మన్‌ పట్నం సునీతారెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరారు.

మరోవైపు మాజీ ఎమ్మెల్సీ, సీనియర్‌ దళిత నాయకుడు డీ రాజేశ్వర్‌రావు కాంగ్రెస్‌ గూటికి చేరారు. శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. చాలకాలం పాటు ఆయనకు ఎమ్మెల్సీగా కొనసాగిన అనుభవం ఉంది. దివంగత నేత రాజశేఖర్‌రెడ్డికి అత్యంత ఆత్మీయుడిగా పేరు గడిరచారు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్సీగా చేశారు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఫాలోవర్‌గా ఉన్నారు. స్టేట్‌ క్రిస్టిషన్‌ మైనార్టీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు రాజేశ్వర్‌. ఈక్రమంలోనే త్వరలో మరింత మంది కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు క్యూ కట్టనున్నారు.

ANN TOP 10