AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎమ్మెల్సీ కవితకు షాక్.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ నిందితురాలిగా చేర్చింది. ఈ నెల 26న విచారణకు రావాలని సీబీఐ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నిందితురాలిగా చేర్చకుండానే ఇదివరకు ఈడీ పలుమార్లు విచారించడం జరిగింది. ఇటీవలే ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నుంచి నోటీసులు అందాయి. అందులో విచారణకు రావాలని ఆదేశించగా.. తాజాగా నిందితురాలిగా చేర్చడంతో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అయితే లిక్కర్ స్కాంలో ఈడీ వేరుగా విచారణ జరుపుతోంది. ఆ విచారణను తనను పిలవొద్దని సుప్రీంకోర్టులో గతంలో కవిత పిటిషన్ వేశారు. నెలల తరబడి వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. కవిత రిలాక్స్ అవుతూనే ఉన్నారు. ఈ తరుణంలోనే మరోసారి ఇప్పుడు సీబీఐ నోటీసులు జారీ చేసింది. అటు సుప్రీంకోర్టులో ఓ వైపు కేసు నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరు అవుతుందా.. లేదా.. ఉత్కంఠగా మారింది.

ANN TOP 10