AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నాగార్జున సాగర్ డ్యామ్‌లో వింత జంతువులు..

ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్ జలాశయంలో నీటి కుక్కలు సందడి చేస్తున్నాయి. అటు భూమి మీద ఇటు నీటిలో ఉండగలిగే ఉభయ చరాల్లో నీటికుక్కలు కూడా ఒకటి. అరుదుగా కనిపించే నీటి‌ కు‌క్కలు నాగార్జున‌ సాగ‌ర్‌ రిజర్వాయర్ లో దర్శనమిచ్చాయి.

సాధారణంగా సముద్ర తీర ప్రాంతాల్లో అరుదుగా కనిపించే వాటర్ డాగ్స్ నల్గొండ జిల్లాలోని నాగార్జున‌ సాగ‌ర్‌ రిజర్వాయర్ లో సందడి చేశాయి. జలాశయంలో నీటి కుక్కలు కలియ తిరుగుతూ వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి. నాగార్జున సాగర్‌లోని వీఐపీ శివాలయం పుష్కర ఘాట్ వద్ద ఈ వాటర్ డాగ్స్ దర్శనమిచ్చాయి. నీటి కుక్కలు కనిపించడంతో సందర్శకులు పెద్ద ఎత్తున ఫొటోలు, వీడియోల్లో వాటిని బంధించారు. కనుమరుగైపోతున్న జాతుల్లో నీటి కుక్కలు కూడా ఒకటి. అటు భూమి మీద ఇటు నీటిలో ఉండగలిగే ఉభయ చరాల్లో నీటి కుక్కలు కూడా ఒకటి. రెండేళ్ళ క్రితం ఒకసారి సాగర్ జలాల్లో నీటి కుక్కలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే ఆ తర్వాత కాలంలో రిజర్వాయర్ లో అవి కనిపించకుండా పోయాయి. తాజాగా సాగర్ జలాల్లో గతంలో కంటే ఎక్కువ సంఖ్యలోనే నీటి కుక్కలు జీవనం సాగిస్తున్నట్లు గుర్తించారు.

ప్రస్తుతం నీటికుక్కల జాతి చాలా వరకు కనుమరుగైందని, కొన్ని మాత్రమే అక్కడక్కడ సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నీటికుక్కల ఉనికిని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా ఉప్పలపాడు పక్షుల కేంద్రంలో నీటికుక్కలను గుర్తించగా తాజాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి కుక్కలు దర్శనమిచ్చాయి. అంతరించి పోతున్న అరుదైన జాతి కావటంతో వీటిని సంరక్షించాలని పర్యాటకులు, జంతు ప్రేమికులు కోరుతున్నారు.

ANN TOP 10