AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘కాళ్ల బేరానికొచ్చిన పొత్తు ఉండదు’

పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. మరోసారి గెలుపు రూచిని చూడాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుంది. విమర్శలు, ప్రతి విమర్శలు, పంచ్ డైలాగ్‌లతో నేతలు హోరెత్తిస్తున్నారు. అలాగే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ దోస్తీ కుదురుతుందని రెండు పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పొత్తులపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటరీ బోర్డు మెంబర్‌గా చెబుతున్నానని, తెలంగాణలో పొత్తు ప్రసక్తే లేదంటూ ఎంపీ లక్ష్మణ్ క్లారిటీ ఇచ్చారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎన్ని రకాలుగా కాళ్ళబేరానికి వచ్చినా బీజేపీ ఒంటరిగా 17 స్థానాల్లో పోటీ చేస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. ఏనాడైనా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయా? అని ప్రశ్నించారు. అలాంటి చరిత్ర కాంగ్రెస్‌కే ఉందని, గత ఎన్నికల్లో ఒక తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్ లాభపడిందని ఆరోపించారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలు సిద్ధంగా లేరని, వారంతా పక్క చూపులు చూస్తున్నారని జోస్యం చెప్పారు. చాలామంది మాతో టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై విచారణ జరుగుతోందని, ఆధారాలు లభిస్తే దర్యాప్తు సంస్థలు అరెస్టు చేస్తాయని చెప్పారు. గత ప్రభుత్వ అవినీతి మీద సీబీఐ దర్యాప్తు కోసం రాష్ట్రం ఎందుకు లేఖ రాయడం లేదని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి కాంగ్రెస్ రాద్ధాంతం చేయడం తప్ప చర్యలు లేవని అన్నారు. రేపటి నుంచి బీజేపీ బస్సు యాత్రలు మొదలవుతాయని చెప్పారు. మోడీని ఓడించాలన్న ఆలోచన తప్ప విపక్షాలకు మరో ఎజెండా లేదని, కుల, కుటుంబ పార్టీలు కాంగ్రెస్ గొడుగు కింద ఏకమయ్యాయని విమర్శించారు. మోడీ దేశం కోసం పనిచేస్తుంటే, ఈ పార్టీల నేతలు తమ పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసం, అవినీతి అక్రమాలతో దోచుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. రేపటి లోక్ సభ ఎన్నికలు ‘మహాభారత’ యుద్ధం వంటిదని, కౌరవ సైన్యం మాదిరిగా విపక్షాలు కలిసి యుద్ధానికి వస్తున్నాయని కామెంట్స్ చేశారు. కేవలం కాంగ్రెస్ నుంచే కాదు.. విపక్ష కూటమి నుంచి నితీశ్ బయటికి వచ్చారని, పొత్తులు ఉండవని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పిందని తెలిపారు. మమతా బెనర్జీ అదే మాట అంటున్నారని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10