AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజధాని ఫైల్స్ విడుదలకు ఓకే.. స్టే ఎత్తివేసిన హైకోర్టు

రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలపై హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేసింది. అయితే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెరకెక్కిన రాజధాని ఫైల్స్ సినిమాపై కోర్టు స్టే విధించింది. వాస్తవానికి నిన్న( గురువారం) రాజధాని ఫైల్స్ సినిమాకు విడుదల కావాల్సి ఉండేది. అయితే వైసీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ తీసిన మూవీ రాజధాని ఫైల్స్. ఈ సినిమా సీఎం జగన్, మాజీ మంత్రి కొడాలి నాని, వైసీపీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. వైసీపీని చులకన చేయాలనే ఉద్దేశంతో సినిమాను తీశారని కోర్టును ఆశ్రయించారు.

దీనిపై గురువారం విచారించిన హైకోర్టు స్టే విధించింది. దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు శుక్రవారం వరకు సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశించింది. ఇక ఇవాళ విచార‌ణ జ‌రిపిన కోర్టు సెన్సార్‌ బోర్డు రివైజింగ్‌ కమిటీ ఇచ్చిన ధ్రువపత్రాలను పరిశీలించింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్‌లు, రికార్డులను పరిశీలించిన హైకోర్టు అన్నీ సక్రమంగానే ఉన్నాయని పేర్కొంటూ సినిమాను విడుదల చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ బోర్డు వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు అనుమతి లభించడంతో టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ANN TOP 10