AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ముగిసిన తొలి రోజు ఆట.. టీమిండియా స్కోర్ ఎంతంటే!

టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌ తొలి రోజు ఆట ముగిసింది. రాజ్కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్లు కోల్పోయి.. 326 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. ప్రత్యర్థి ఇంగ్లాండ్‌ను బౌలింగ్‌కు ఆహ్వనించింది. బ్యాట్ పట్టి మైదానంలోకి అడుగు పెట్టిన టీమిండియాకు ఆదిలోనే షాక్ త‌గిలింది. వైజాగ్ టెస్టులో డబుల్ సెంచరీతో మెరిసిన ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్(10) మార్క్ వుడ్ బౌలింగ్ లో స్లిప్‌లో ఉన్న జో రూట్ చ‌క్క‌ని క్యాచ్ ప‌ట్ట‌డంతో డగౌట్‌కు చేరాడు.

ఆ త‌ర్వాత శుభ్‌మ‌న్ గిల్(0)ను డ‌కౌట్‌గా పెవిలియ‌న్ పంపాడు. అలాగే ర‌జ‌త్ పాటిదార్ కూడా(5) పరుగుల వద్దనే టామ్ హ‌ర్ట్లే ఔట్ చేశాడు. దీంతో ఆ సమయంలో టీమిండియా క‌ష్టాల్లోకి పడింది. 33 పరుగులకు 3 వికెట్లు కోల్పోపోవడంతో ఇంగ్లాండ్ జట్టు మ్యాచ్‌పై పట్టు బిగించింది. ఆ సమయంలో జట్టుకు కీలకంగా మారిన కెప్టెన్ సెంచరీతో అదరగొట్టాడు. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాతో చేతులు కలిపి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ తరుణంలో అటు రోహిత్ సెంచరీ అందుకున్నాడు. అలాగే ఆటలో జోరును కొనసాగించిన జడేజా సైతం సెంచరీతో చెలరేగి ఆడాడు.

ఈ ఇద్దరు ప్లేయర్లు సెంచరీలు చేయడంతో టీమిండియా టార్గెట్ భారీ దిశగా సాగింది. రోహిత్ శర్మ ఔట్ అయ్యే సమయానికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. ఆ తర్వాత టెస్టు మ్యాచ్‌లోకి ఆరంగ్రేటం చేసిన యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ (62) పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్, జడేజా మధ్య పట్నర్ షీప్ బలపడుతున్న సమయంలో సర్ఫరాజ్ రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో జడేజా (131), కుల్దీప్ యాదవ్ (1) నాటౌట్‌గా ఉండగా.. టీమిండియా స్కోర్ 326 గా ఉంది. ఇందులో ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ 3 వికెట్లతో సత్తాచాటగా.. అటు టమ్ హార్ట్లీ 1 వికెట్ తీశాడు.

ANN TOP 10