తిరుపతి జూపార్క్‌లో విషాదం చోటు చేసుకుంది. శ్రీ వేంకటేశ్వర జులాజికల్ పార్క్ సందర్శనకు వెళ్లిన ఓ వ్యక్తి ఎవరూ గుర్తించని సమయంలో లయన్ ఎన్‌క్లోజర్‌లోకి చొరబడ్డాడు. సెల్ఫీ కోసం వెళ్లగా అతడిపై సింహం దాడి చేయగా వెంటనే అతడు చెట్లుపైకి ఎక్కాడు. చెట్టుపై ఉన్న అతడు ప్రమాదవశాత్తు కిందపడడంతో అతడిపై దాడి చేసి చంపివేసింది. గమనించిన జూ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సింహం దాడిలో చనిపోయిన వ్యక్తి వివరాలను సేకరిస్తున్నారు.









